శ్రీకాళహస్తి మండలం పరిధిలోని జగ్గురాజుపల్లిలో ఆదివారం సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.