రేణిగుంటలో గాల్లోనే విమానం..!

66చూసినవారు
రేణిగుంటలో గాల్లోనే విమానం..!
శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట విమానాశ్రయంలో ఇండిగో విమానం ల్యాండింగ్ కాకుండా గాల్లోనే చక్కర్లు కొట్టింది. హైదరాబాద్ నుంచి రేణిగుంటకు ఆదివారం రాత్రి 8:40కి ఇండిగో విమానం చేరుకుంది. ఈదురు గాలులతో వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిర్పోర్ట్ నుంచి ల్యాండింగ్కు క్లియరెన్స్ రాలేదు. అరగంట పాటు ఆకాశంలోనే విమానం చక్కర్లు కొట్టింది. గాలుల తీవ్రత తగ్గకపోవడంతో ఆ విమానాన్ని చెన్నైకి మళ్లించి అక్కడ ల్యాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్