ఊరందూరులో శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి, అమ్మవార్ల కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం తరఫున ఈవో బాపిరెడ్డి, బొజ్జల సురేశ్ రెడ్డి దంపతులు మంగళవారం పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ప్రదీప్ రెడ్డి, లక్ష్మయ్య, రవికుమార్, అధికారులు పాల్గొన్నారు.