కూటమి ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నట్లు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్.సి.వి. నాయుడు గురువారం తెలిపారు. పాలనకు ఏడాది పూర్తైన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని చెప్పారు. త్వరలో అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని, ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.