శ్రీకాళహస్తిలోని కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. వివిధ కేసులను పరిష్కరించిన సందర్భంగా 12వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ కక్షిదారులు ఇద్దరూ సంతోషంగా వెళ్లేలా చేయడమే లోక్ అదాలత్ లక్ష్యమన్నారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జ్ బేబీ రాణి మాట్లాడుతూ పరస్పర అంగీకారంతో రాజీమార్గం ఎంచుకోవాలన్నారు.