శ్రీకాళహస్తి పట్టణం, పరిసరాల్లో ఒంటరిగా వెళ్లే మహిళల మెడల నుండి గొలుసులు లాక్కుంటూ పరారవుతున్న ఇద్దరు యువకులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు మద్యం, గంజాయి అలవాటులతో ద్విచక్ర వాహనాలు దొంగిలించి, వాటిపై తిరుగుతూ గొలుసులు కొట్టేవారని సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు. వీరి వద్ద రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.