శ్రీకాళహస్తి: హర హరేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు

54చూసినవారు
శ్రీకాళహస్తి: హర హరేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న హరిహర తీర్థంలో ఉన్న శ్రీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ హర హరేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం మండల అభిషేకం నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన గావించి విశేష పూజలు చేశారు. అనంతరం ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్య క్రమంలో దేవస్థానం ఏఈఓ లోకేశ్ రెడ్డి, దేవస్థానం ఉప ముఖ్య అర్చకులు అర్ధగిరి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్