శ్రీకాళహస్తి: ముగిసిన పరమేశ్వరి అమ్మవారి జాతర

51చూసినవారు
శ్రీకాళహస్తి: ముగిసిన పరమేశ్వరి అమ్మవారి జాతర
రేణిగుంట మండలంలోని రామకృష్ణాపురంలో ఉన్న అంకాలు పరమేశ్వరి అమ్మవారి జాతర బుధవారంతో ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన జాతరలో బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ప్రతిమ ముగ్గు వేశారు. గ్రామంలోని మహిళలు సామూహికంగా నైవేద్యం తీసుకువచ్చి, అమ్మవారికి సమర్పించారు. రాత్రి బ్యాండు వాయిద్యాలు, పంబ జోళ్ల దరువులు, బాణసంచా పేలుళ్ల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్