శ్రీకాళహస్తి టూ టౌన్ పరిధిలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు గురువారం సీఐ వెంకటేశ్ తెలిపారు. పక్కా సమాచారంతో విశాఖపట్నం నుంచి తిరుపతికి గంజాయి సరఫరా చేస్తూ శ్రీకాళహస్తి ప్రాంతంలో అమ్ముతున్న పన్నూరు బాబు (63), రాజన్ కుమార్ (41)లను పట్టణంలోని బైపాస్ వంతెన వద్ద అరెస్టు చేశారు. నిందితుల నుంచి 12 కేజీల గంజాయి, 4000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.