శ్రీకాళహస్తిలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం

66చూసినవారు
శ్రీకాళహస్తిలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం
శ్రీకాళహస్తి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సూచనలతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం నిరుపేదలకు పండగ దినం అన్నారు.

సంబంధిత పోస్ట్