శ్రీకాళహస్తిలో ఈనెల 13న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొననున్నారు. సభ విజయవంతం కావాలని కోరుతూ బుధవారం పార్టీ కార్యాలయంలో నాయకులు గోడ పత్రికను ఆవిష్కరించారు. సభలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.