నాయుడుపేట మండల పరిధిలోని గొట్టిప్రోలు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల నీటి వసతి కోసం ఏర్పాటు చేసిన త్రాగునీరు వృధాగా పోతుందని స్థానికులు విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల భవనం మీద ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకు నుండి నిత్యం నీళ్లు కారుతుండడంతో నీరు వృధా అవ్వడంతో పాటు పాఠశాల భవనం కూడా దెబ్బతింటుంది. పాఠశాల హెచ్ఎం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు తెలిపారు.