సూళ్లూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరికి స్థానిక పట్టణానికి చెందిన చెంబేటి సతీష్ బాబు సురేఖ దంపతులు బంగారు పూతతో కూడిన వెండి వడ్డాణంను ఆదివారం బహుకరించారు. వెండి వడ్డాణంకు 30 గ్రాముల బంగారంతో పూత వేయించి స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతులు మీదుగా ఆలయ ఈవో డబ్బుగుంట వెంకటేశ్వర్లుకు అందజేశారు. సూళ్లూరుపేట తెదేపా ఇన్చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, తెదేపా నాయకులు పాల్గొన్నారు.