వెంకటగిరిలో నేడు మెగా జాబ్ మేళా

52చూసినవారు
వెంకటగిరిలో నేడు మెగా జాబ్ మేళా
వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ డిగ్రీ కళాశాలలో గురువారం ఉదయం 8 గంటల నుండి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పదో తరగతి నుండి ఇంటర్ ఐటిఐ డిగ్రీ ఉత్తీర్ణులైన యువత పాల్గొనవచ్చు అని తెలిపారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్