నాయుడుపేట మండలంలోని పుదూరు గ్రామంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ కంపెనీ బస్సు మల్లం వైపు వెళ్తూ పుదూరు వద్ద ఆగి ఉన్న కారును తప్పించబోయే ఎదురుగా ఉన్న ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా.. గాయపడిన వారిని నాయుడుపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిపారు.