ఓ రోడ్డు ప్రమాదం ద్వారా ఎర్రచందనం అక్రమ రవాణా బయటపడింది. నాయుడుపేట అగ్నిమాపక కార్యాలయం వద్ద శనివారం ఓ కారు స్కూటీని ఢీకొట్టింది. స్కూటీపై ఉన్న శ్రీనివాసులు గాయపడగా, కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు, వారు తప్పుడు నంబరు ప్లేటుతో 46 మూడో గ్రేడ్ ఎర్రచందనం దుంగలతో చెన్నై వెళ్తున్నారు. కారు సురేష్ పేరిట ఉంది.