శనివారం సూళ్లూరుపేటలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం ఎండ తీవ్రంగా ఉన్నా, మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షం కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. వారం రోజులుగా ఆగి ఆగి పడుతున్న వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.