తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం తడ మండలం బోడిలింగాలపాడు క్రాస్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిపోయింది. చెన్నై- కోలకతా జాతీయ రహదారిపై రోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. బోడిలింగాలపాడు వద్ద ఏర్పాటు చేసిన క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు మలుపు తీసుకునే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.