తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న సుందరికీకరణ పనులను గురువారం మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా పరిశీలించారు. పట్టణంలోని బేరిపేట సెంటర్, దర్గారోడ్డు, బస్టాండ్, సీఎస్ తేజా సెంటర్ ప్రాంతాల్లోని డివైడర్ల మధ్య చెట్లను నాటి సంరక్షిస్తున్నారు. ఈ ప్రాంతంలోని చెట్లను పారిశుధ్య కార్మికులు శుభ్రం చేశారు.