తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారిసత్రం మండలం మానెరి గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన పొలంలో ఉన్న ట్రాన్సఫార్మర్కు తీగలు అల్లుకున్నాయి. దీంతో ఏ ప్రమాదం జరుగుతుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలతో ఏపుగా పెరిగిన చెట్లతీగలతో ఈ సమస్య వచ్చినట్లు వారు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు.