తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గం కోటపోలూరు గ్రామంలో డ్రైనేజీ కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దోమలు, ఈగలు వృద్ధి చెంది డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. మురికి నీరు మంచినీటి సరఫరా అయ్యే పైప్ లైన్ లో కలవడంతో మంచినీరు సైతం కలుషితం అవుతుందని అన్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు.