తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణ పరిధిలోని ఆర్ అండ్ బీ రహదారుల్లో భారీ గుంతలు మారడంతో వాహనదారులు అందులో పడి తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. రాత్రి సమయాల్లో భారీ గుంతలు తెలియక వాహనాలు దిగుబడిపోయి రోడ్డుపై నిలిచిపోతున్నాయి. దీంతో ఈ రహదారిపై తరచూ గంటల కొద్ది ట్రాఫిక్ స్తంభించి పోతుంది. అధికారులు స్పందించి తక్షణ మరమ్మతులు చేపట్టాలని వాహనదారులతో పాటు ప్రజలు కోరుతున్నారు.