తడ మండలంలోని బాల యేసు పుణ్యక్షేత్రం వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మార్జిన్‌లో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టడంతో, క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ మృతి చెందాడు. జార్ఖండ్ నుంచి చెన్నైకి ఐరన్ దిమ్మెలు తీసుకెళ్తున్న లారీని, నెల్లూరు వైపు నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. రాడ్లు క్యాబిన్‌పై పడిపోవడంతో డ్రైవర్ చిక్కుకుపోయాడు. ట్రాఫిక్‌కు రెండు గంటలు అంతరాయం కలిగింది.