తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట ఐసిడిఎస్ కార్యాలయంలో సిపిడిఓ ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో గురువారం సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చేరిన చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. ఆటలు, పాటల ద్వారా విద్యను అందిస్తూ, పౌష్టికాహారం కూడా అందిస్తామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.