నాయుడుపేటలో టన్ను ఎర్రచందనం పట్టివేత

713చూసినవారు
నాయుడుపేటలో టన్ను ఎర్రచందనం పట్టివేత
తిరుపతి జిల్లా నాయుడుపేట అగ్నిమాపక శాఖ కార్యాలయం సమీపంలో శనివారం ఉదయం ఒక టన్ను ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెంకటగిరి నుంచి చెన్నైకు తరలిస్తున్న సమయంలో, కారు బైక్‌ను ఢీకొట్టి ఆగిపోవడంతో ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారంతో అధికారులు అక్కడికి చేరుకొని ఎర్రచందనం రవాణా విషయాన్ని గుర్తించారు. కారును స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్