తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజీలి మండలంలోని పలు గ్రామాలలో రోడ్లపై ఏర్పడిన గుంతలకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. మండల కేంద్రంలోని ఓజీలి నుంచి మనమాల, బత్తాలాపురం, కురుగొండ గ్రామాలకు వెళ్లే రోడ్డుపై అక్కడక్కడ తారు కరిగిపోయి గతుకులు, గుంతలుగా ఏర్పడి ఉన్నాయని తెలిపారు. ప్రమాదాలు జరగకముందే రోడ్లపై ఉన్న గుంతలకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, గ్రామస్థులు కోరుతున్నారు.