సూళ్లూరుపేట: భద్రతా వలయంలో షార్

77చూసినవారు
సూళ్లూరుపేట: భద్రతా వలయంలో షార్
భారత్‌,పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో షార్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. భద్రత దృష్ట్యా అణువణువు పర్యవేక్షిస్తున్నారు. దీంట్లో భాగంగా శనివారం మాక్‌ డ్రిల్‌ను గెట్‌ నెంబర్‌ 1బి వద్ద సుమారు 70 మంది సిఐఎస్‌ఎఫ్‌ సిబ్బందితో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐఎస్‌ఎఫ్‌కి చెందిన సంజరు కుమార్‌ డీఐజీ, సీనియర్‌ కమాండంట్‌ సంజిత్‌ కుమార్‌, డిప్యూటీ కమాండంట్‌ ఎం.కె.గౌర్‌, సూళ్లూరుపేట సిఐ.మురళీకృష్ణ ఉన్నారు.

సంబంధిత పోస్ట్