సూళ్లూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ చెంగాలమ్మ తల్లి పరమేశ్వరీ ఆలయంలో శనివారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. 103రోజుల వ్యవధిలో భక్తులు సమర్పించిన హుండీ ద్వారా రూ. 61, 71, 477 నగదు, 35గ్రాముల బంగారం, 130గ్రాముల వెండి, పలు విదేశీ కరెన్సీలు ఆదాయంగా వచ్చాయని ఆలయ సహాయక కమిషనర్, కార్యనిర్వాహక అధికారిణి ప్రసన్నలక్ష్మి తెలిపారు.