కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలలకే ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుందని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. గురువారం సూళ్లూరుపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఎన్నికల ముందు అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం, గ్రావెల్ అక్రమ రవాణా జోరుగా సాగుతుందన్నారు.