తడ మండలం మాంబట్టు సెజ్‌లోని ఇన్‌ఫిల్ సాక్స్ పరిశ్రమలో నిబంధనలకు విరుద్ధంగా కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లించడంపై సీఐటీయూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 3నెలలుగా పీఎఫ్ డబ్బులు జమ చేయకపోవడంతో పాటు మే నెల జీతాలు ఇప్పటివరకు ఇవ్వలేదని సీఐటీయూ నియోజకవర్గ కార్యదర్శి లక్ష్మయ్య ఆదివారం తెలిపారు. పరిశ్రమ యాజమాన్యానికి వినతి ఇచ్చినా స్పందన లేదని, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలకు సమాచారమిచ్చామని చెప్పారు.