వెంకటగిరి: మాజీ సీఎంకు నివాళులు

59చూసినవారు
వెంకటగిరి: మాజీ సీఎంకు నివాళులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా శుక్రవారం వెంకటగిరి పట్టణంలోనినేదురుమల్లి భవనంలో స్థానిక వైసీపీ నేతలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని త్రిభువని సెంటర్ లోని జనార్ధన్ రెడ్డి విగ్రహం వద్దకు చేరుకొని జోహార్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అంటూ నినాదాలు చేస్తూ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్