తంబళ్లపల్లి మల్లయ్య కొండ లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో పలు పనులకు ఏడాది పాటు హక్కులు పొందడానికి 9వ తేదీన వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు శుక్రవారం ఈవో ముని రాజు తెలిపారు. పూజా సామాగ్రి విక్రయాలు, తలనీలాలు సేకరణ, కొండ కింద వాహనాల పార్కింగ్, పాదరక్షలు భద్రపరచుటకు వేలంపాట ఉంటుందన్నారు. ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.