బి. కొత్తకోట మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీ హిల్స్ లో వేటగాళ్లు దుప్పిని హతమార్చడం శనివారం వెలుగు చూసింది. మదనపల్లి ఎఫ్ఆర్ఓ జయ ప్రసాదరావు కథనం మేరకు కురబలకోట మండలం తెట్టు పంచాయతీ మండెం వారి పల్లికు చెందిన మజ్జిగ శివ(48) దుప్పిని వేటాడటం గుర్తించినట్లు తెలిపారు. దుప్పి మాంసం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు.