బి. కొత్తకోట మండలంలో కుటుంబ సమస్యలతో వ్యక్తి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు శనివారం పోలీసులు తెలిపారు. సీతివారి పల్లెకు చెందిన మద్ది రెడ్డి (38) కుటుంబ సమస్యలతో టమోటా పంటకు కొట్టడానికి ఇంట్లో తెచ్చి పెట్టిన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడిని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉందని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.