ములకలచెరువు మండల సర్వసభ్య సమావేశం కోరం లేక గురువారం వాయిదా వేయడం జరిగిందని ఎంపీడీవో హరి నారాయణ తెలిపారు. మండల సమావేశం వాయిదా వేశాను అన్న కోపంతో తనతో గొడవ చేసి భయభ్రాంతులకు గురి చేయడం కాకుండా దూషించారని జడ్పిటిసి మోహన్ రెడ్డి, కొంతమంది ఎంపీటీసీ లపై ఎంపీడీవో శుక్రవారం ములకలచెరువు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్ఐ నరసింహుడు జడ్పిటిసి, ఎంపీటీసీ లను విచారించి చర్యలు తీసుకుంటానని తెలిపారు.