ములకలచెరువులో ఫ్రైడే డ్రైడే

57చూసినవారు
ములకలచెరువులో ఫ్రైడే డ్రైడే
ములకలచెరువు పట్టణంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. వైద్య ఆరోగ్య సిబ్బందితో కలసి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఇంటింటికీ వెళ్లి ఇళ్ల పరిసరాల్లో నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని, దోమలు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఏఎన్ఎం లలిత, ఆశాలు లక్షి, లక్ష్మీదేవి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్