తంబళ్లపల్లి మల్లయ్య కొండపై వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి హుండీ ద్వారా రూ. 6, 64, 916 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో మునిరాజ, టెంపుల్ ఇన్స్పెక్టర్ శశికుమార్ తెలిపారు. శ్రీవారి సేవకులు భక్తులతో కలిసి బుధవారం హుండీ లెక్కించారు. అక్టోబర్ 30వ తేదీ నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఈ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆదాయాన్ని దేవస్థానం ఖాతాలో బ్యాంకులో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.