కురబలకోట: రోడ్డు వేయిస్తున్న వ్యక్తి పై దాడి

77చూసినవారు
కురబలకోట: రోడ్డు వేయిస్తున్న వ్యక్తి పై దాడి
రోడ్డు వేయిస్తున్న వ్యక్తిపై దాడి చేసిన ఘటన మంగళవారం కురబలకోట మండలంలో జరిగింది. ముదివేడు ఎస్సై దిలీప్ కుమార్ తెలిపిన వివరాలు మేరకు అంగళ్లులోని నందిరెడ్డి గారి పల్లి పంచాయితీ బండపల్లికి ప్రభుత్వం కొత్తగా రోడ్డు మంజూరు చేసింది. బండ్లపల్లి శ్రీనివాసులు రెడ్డి (53) తన సొంత జాగా రోడ్డుకు ఇచ్చి దగ్గరుండి రోడ్డు వేయిస్తుండగా చిన్నపరెడ్డి అనే వ్యక్తి రాళ్లతో దాడి చేశాడని ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్