సొంత ఇంటిలోనే ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు నూజివీడు పోలీసులు తెలిపారు. కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని చేనేత నగర్ లో నివసిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ నారాయణ(50) శుక్రవారం తాను ఉంటున్న ఇంట్లోనే తాడుతో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. భార్య లక్ష్మీదేవి గమనించి కేకలు వేయడంతో గ్రామస్తులు నారాయణను ఉరి నుండి తప్పించారు. అప్పటికే అతను మృతి చెందాడని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.