కురబలకోట కు చెందిన వెంకట శివ తిరుమలలో ట్యాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 12వ తేదీన రాంబగీచా బస్టాండ్ వద్ద తన వాహనాన్ని నిలపగా తిరుపతికి చెందిన ముగ్గురు డ్రైవర్లు వాగ్వివాదానికి దిగారు. మాట మాట పెరిగి రాయితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వెంకటశివ ను తిరుపతి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడని, తాగిన మైకంలో వెంకట శివ పై దాడి చేశారని మంగళవారం కుటుంబ సభ్యులు తెలిపారు.