ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు శనివారం ముదివేడు పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. కురబలకోట మండలం మొగసాల పల్లికి చెందిన అమర నారాయణ (45) శనివారం అంగళ్లు కు వచ్చాడు. సాయంత్రం చీకటి పడగానే మోటారు బైకుపై స్వగ్రామానికి బయలుదేరాడు. చెన్నా మర్రిమిట్ట వద్ద ట్రాక్టర్ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.