కురబలకోట మండలం మిట్స్ కళాశాల ఎన్‌సిసి క్యాడేట్స్ ట్రెక్కింగ్ నిర్వహించారు. మంగళవారం కళాశాల నుండి క్యాడేట్స్ హార్స్‌లీ హిల్స్ కొండపైకి చేరుకున్నట్లు ఎన్‌సిసి లెఫ్టినెంట్ నవీన్ కుమార్ తెలిపారు. దేశ రక్షణ కోసం అత్యవసర సమయాలలో క్యాడేట్స్ కు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో హవల్దార్లు నందన్ రావు, మదన్ పాల్గొన్నారు.