తంబళ్ళపల్లె నియోజకవర్గంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శనివారం పర్యటిస్తారని కురబలకోట మండల టిడిపి అధ్యక్షుడు వైద్య సురేంద్ర తెలిపారు. ములకలచెరువు మండలంలోని ప్రభుత్వ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తారని సురేంద్ర తెలిపారు.