ముదివేడు: జడ్పీ స్కూల్ విద్యార్థులకు పరీక్ష సామాగ్రి వితరణ

51చూసినవారు
ముదివేడు: జడ్పీ స్కూల్ విద్యార్థులకు పరీక్ష సామాగ్రి వితరణ
కురబలకోట మండలం, ముదివేడు జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అయూబ్ అందించారు. పరీక్షలు బాగా రాసి, మంచి ఉత్తిర్ణతతో పాఠశాలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకు రావాలని కోరారు. మోహన్ రెడ్డి, స్కూల్ ఛైర్మన్ భావజాన్, అబ్జల్, బాజి, సాదిక్, ఇందాద్, షావుల్, తాజు హరిసింగ్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్