పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు దృష్టి సారించాలని ములకలచెరువు సీఐ లక్ష్మన్న సూచించారు. నెలవారీ సమీక్షలో భాగంగా మంగళవారం ములకలచెరువు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ములకలచెరువు, తంబళ్లపల్లి పెద్దమండ్యం పోలీస్ స్టేషన్ల ఎస్సై, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు తో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించి గ్రామాలలో గస్తీ పెంచాలన్నారు.