కరెంటు షాక్ కొట్టి యువకుడు తీవ్రంగా గాయపడినట్లు తంబళ్లపల్లి ఎస్సై లోకేష్ రెడ్డి తెలిపారు. ములకలచెరువు మండలం పేయలవారి పేటకు చెందిన ధనుంజయ రెడ్డి (19) తాత సత్తిరెడ్డి ఇంట్లో ఉంటూ ఐటిఐ చదువుకుంటున్నాడు. శుక్రవారం వరిగడ్డి వేసుకుని ట్రాక్టర్ లో వెళుతుండగా ముద్దుల దొడ్డి గ్రామం వద్ద విద్యుత్ వైర్లు ట్రాక్టర్ కు తగిలి కరెంట్ షాక్ కొట్టి యువకుడు గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.