తంబళ్లపల్లి ఎంఈఓ కాలనీలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పాఠశాల కమిటీ విధులు, బాధ్యతలపై గురువారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ త్యాగరాజు ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ - స్వచ్ఛ విద్యాలయ, పాఠశాల పర్యావరణ పరిరక్షణ, మనబడి - మన భవిష్యత్తు, బయట పిల్లలు - సదుపాయాలు, మధ్యాహ్న భోజనం పథకం పై శిక్షణ కార్యక్రమంలో చర్చించారు.