పెద్దమండెం: బాధ్యతలు చేపట్టిన ఎస్సైగా వెంకటేశ్వర్లు

69చూసినవారు
పెద్దమండెం: బాధ్యతలు చేపట్టిన ఎస్సైగా వెంకటేశ్వర్లు
అన్నమయ్య జిల్లా, పెద్దమండెం ఎస్సైగా వెంకటేశ్వర్లు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సమస్యలపై ప్రజలు నేరుగా తనను కలసి విన్నవించుకోవచ్చునని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్