అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లెలో శుక్రవారం ఉదయం 10 గంటలకు విధులు బహిష్కరించి హమాలీలు నిరసన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుల పిలుపుమేరకు హమాలీలు రమణ రెడ్డప్ప తదితరులు తంబళ్లపల్లి సివిల్ సప్లైస్ గొడవను వద్ద విధులను బహిష్కరించి, తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హమాలీలకు కూలీలు కమీషన్ పెంచాలన్నారు. అలాగే ఇళ్ల తరబడి ఉన్న తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.