బైకు నిర్లక్ష్యంగా నడిపి వృద్ధుడు మృతికి కారణమైన గిరీష్ పై కేసు నమోదు చేసినట్లు బుధవారం పిటిఎం ఎస్సై హరిహర ప్రసాద్ తెలిపారు. చిన్న పొంగుపల్లి కి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు చౌడప్ప 9వ తేదీన చెండ్రాయునిపల్లె వద్ద ఆటో కోసం వేచి ఉండగా మేకలవారిపల్లి హరీష్ మోటారు బైకుతో ఢీ కొట్టాడు. బాధితుడుని కుటుంబీకులు బెంగుళూరు ఆసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రి మృతి చెందడంతో కేసు నమోదు చేశారు.